Sunday, May 10, 2020

మాతృదినోత్సవ వేళ....

కమ్మనైన  అమ్మ ప్రేమను  స్మరించుటకు ఒక రోజు చాలునా
కల్మషం లేని ప్రేమకు వెల కట్టడం సాధ్యమా
అమ్మ పడ్డ కష్టాలని కన్నీళ్లని త్యాగాలని  దాచడంలో మేటి
అమ్మ  ప్రేమకు ఈ లోకంలో రాదు మారేది సాటి
అమ్మా నీ  ఓర్పుకు సహనానికి వందనాలు శతకోటి
దేశానికి రాజు అయినా పూరి గుడిసె లోని పేద అయినా
అమ్మ ప్రేమకి కాక తప్పదు దాసోహం
అమ్మ ను  అమ్మ ప్రేమ ను  ప్రతి రోజూ  ఆరాధిద్దాం
మాతృమూర్తిని  ఎల్లప్పుడూ గౌరవిద్దాం
అమ్మ ప్రేమ ఒక వరం, అందరికి దొరకని భాగ్యం
ఆ ప్రేమ విలువ మరువ కుండా ముందుకు సాగుదాం 

ఇది మా అమ్మకి ప్రతి అమ్మ కి అంకితం



Monday, October 22, 2012

My version of "pushpa vilaapam"

మనసు మెచ్చిన తుమ్మెదా మరల వచ్చితివెందుకే..

గాయపడిన గుండెకే ఆశను రేకెత్తిస్తావెందుకే ... 

ఎదను తొలిచిన  తుమ్మెదా నీకేం తెలుసు నా వ్యధ....

ఎదురు చూసిన కళ్ళకే  తెలుసు కదా ఆ భాధ


Friday, April 2, 2010

నా ఊహా సుందరి ......................

నా ఊహా సుందరి నన్ను కరుణించి

కలలో కనిపించి ప్రేమను పంచి ఆపై నన్ను కవ్వించి

మనసుని గిలిగింతలు పెట్టి

మైకం లో ముంచి

మురిపించి మైమరిపించి

ఆనందడోలికలలొ తేలియాడించి

ఒక మధుర స్వప్నాన్ని నాకు మిగిల్చి

ఒక తీపి జ్ఞాపకంగా నా హృదయం లో నిలిచిపోయింది

Thursday, August 6, 2009

నా లోని కవి ..

నాలోని కవిని మేల్కొలిపి తను మాత్రం దూరంగా వెళ్ళిపోయింది

నా హృదయంలో సరిగమలు మీటి ఆ స్వరాలను మాత్రం విననంది

నా మనస్సు లో గులాబీలు నాటి ఆ పరిమళాన్ని ఆస్వాదించనంది

కనులు మూస్తే కలలతో కనురెప్పలు బరువాయె

కనులు తెరిస్తే తను కనిపించక కన్నీళ్లు వర్షించే

ఆమెను చూసిన క్షణం నా గుండె లయ తప్పింది

మనస్సు గాలిలో విహరించసాగింది

లోకాన్ని మరిచా నన్నే నే మైమరిచా కానీ తనే తలచా వలచా వరించాలని ఆశించా

కానీ నా ఆశ అడియాస అయ్యింది తను నన్ను విడిచి వెళ్ళిపోయింది , నా మనస్సును దోచుకుపోయింది

ప్రస్తుతం నా మనసూ ఖాళీ ఎవరైన దానిని మీ మనస్సు తో నింపగలరా???


Sunday, May 10, 2009

అమ్మకి చిరు కానుక

అమ్మకి వందనం

అమ్మ ప్రేమ కి అభివందనం

అమ్మ ఓర్పుకి పాదాభివందనం

అమ్మ అను మాట అతి మధురం

అమ్మ చేతి స్పర్స అమోఘం

అమ్మ గోరుముద్ద అమృతం

అమ్మ ఒక అద్బుతం

అమ్మ అనురాగం అద్వితీయం

అమ్మ తో ఆడుతూ పాడుతూ ఉడికిస్తూ విసిగిస్తూ అల్లరి చేస్తూ ఎప్పటికి ఒక చిన్న పిల్లాడిలా ఉండిపోయేలా చెయ్యమని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ దేనిని అమ్మ కి అంకితమిస్తున్నా..............

Tuesday, April 21, 2009

కల...........

కలలు కనడం ఒక యోగం

కలలు రాకుండడం ఒక రోగం

చిన్న పెద్ద పేద ధనిక కుల మత వర్ణ విబేధాలు లేనిది ఒక్క కల మాత్రమే

కానీ చంద్రుని లో మచ్చ వలె కలలలో పీడకల ఒకటి

కలలు కనే స్వాతంత్ర్యాన్ని ఆపే హక్కులేదేవ్వరికి

కలలు కనండి కన్న కలల్ని నిజం చెయ్యండి

కాని జీవితాన్ని ఒక కలగా మాత్రం మార్చకండి

Monday, April 20, 2009

ప్రేమికుల కోసం..........

నన్ను నేను మరుచుట సాధ్యమే కాని నిన్ను నేను మరుచుట అసాధ్యం

నిన్ను విడిచి వుండుట విధి కాని తల్లిదండ్రుల మాట మనకు పరమావధి

కనిపెంచిన
వారి కంటే కనిపించని ప్రేమ ముఖ్యమా?

గెలుపు
ఓటములు సహజం ఎందుకంటే ఇది జీవితం

నీ
కలయిక నా జీవితం లో ఒక మధుర స్వప్నం

కాని
స్వప్నం కొద్ది సేపటి లో కరిగిపోదా

మానవ జీవితం సృష్టి లో మహోత్క్రుష్టం
అట్టి జీవితాన్ని ప్రేమ విఫలమగుట చే హతం చేయుట సమంజసమా

కాబట్టి ప్రపంచ ప్రేమికులారా ప్రేమిస్తే పెద్దలను ఒప్పించండి
కాని ప్రేమ విఫలమైందని జీవితాన్ని మాత్రం అంతం చేయకండి